గోరి కొత్తపల్లిలో ఘనంగా గురుదేవ ఆశ్రమంలో చండీయాగం

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలోని గురుదేవ ఆశ్రమంలో జరుగుతున్న అఖండ శివనామ సప్తాహంలో భాగంగా నేడు అనగా శుక్రవారం రోజున చండీయాగం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఈ యాగంలో విశ్వశాంతి, జగత్క కల్యాణం కోసం చేపట్టినట్లు శ్రీశ్రీశ్రీ సహజానంద స్వాములవారు తెలిపారు. గత 6 రోజులుగా 'శివాయ నమః ఓం' నామస్మరణ కొనసాగుతోంది. గ్రామ ప్రజలు, సర్పంచ్ నిమ్మల శంకర్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕