భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీసులు రంగయ్యపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఒక టాటా ఏసీ వాహనం, ఒక టూ వీలర్‌పై వచ్చిన ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, దొంగతనానికి ఉపయోగించిన వాహనాలు, 4 మొబైల్ ఫోన్లు, రూ. 51,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అజ్మీర రాజేష్, నునావత్ రాజు, భూక్య చరణ్, భూక్య కళ్యాణ్, నునావత్ తిరుపతి ఉన్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.