గొర్లవేడు లో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు

ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలో గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, తెగువను కొనియాడుతూ ఆమెకు నివాళులు అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ జరిపిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕