పోలీసుల విధులకు మందుబాబుల ఆటంకం

భూపాలపల్లి పట్టణంలో బుధవారం రాత్రి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంఆర్వో ఆఫీస్ రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు మందుబాబులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు తెలిసింది. ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసమే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, తాగి రోడ్లపై తిరగడం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుంకే మహేష్, ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్, శ్యామ్, ఏఎస్ఐ విరారెడ్డి, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్