రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన సుంకరి రవీందర్, పరకాలలో బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా చలివాగు వద్ద భూపాలపల్లి నుంచి పరకాలకు వెళ్తున్న బస్సు అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రవీందర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య రమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి గోరి ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి తెలిపారు.