భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రాష్ట్ర బీజేపీ శ్రేణులు 'రైతు గోస. బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా పర్యటించాయి. కొత్తపల్లి గ్రామంలోని వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, మద్దతు ధర, తూకాల్లో వ్యత్యాసాలు, సంచుల కొరత, సకాలంలో డబ్బులు జమ కాకపోవడం వంటి సమస్యలను రైతుల నుండి తెలుసుకున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులపై నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.