ఫోటోగ్రాఫర్ కుటుంబానికి రూ.15,000 ఆర్థిక సాయం

రేగొండ మండలం కోడవడంచ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ పబ్బ నాగరాజు తండ్రి ఇటీవల మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న రేగొండ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. ఫోటోగ్రాఫర్ కుటుంబానికి అసోసియేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎల్దండి రాకేష్, మండల కోశాధికారి బండి కమలాకర్, సభ్యులు మల్లెబోయిన స్వామి, చుక్క ప్రశాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్