పూసుకుపల్లి- మద్దులపల్లి అడవుల్లో కార్చిచ్చు

భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పూసుకుపల్లి- మద్దులపల్లి అటవీప్రాంతంలో కార్చిచ్చు అంటుకుంది. సోమవారం రాత్రి అడవిలో మంటలు ఎగిసిపడ్డాయి. రహదారి ప్రక్కన మంటలు వ్యాపించడంతో అడవి జీవరాశులు పరుగులు తీశాయి. అటవీ సంపద కార్చిచ్చుతో బూడిద అవుతున్నా అటవీశాఖ అధికారులు స్పందించ ల్లేదు. వేసవికాలం కావడంతో ఆకులన్నీ ఎండిపోయి ఉండడంతో మంటలు కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తున్నా అధికారులు రక్షణ చర్యలు తీసుకోలేదు.

సంబంధిత పోస్ట్