భూపాలపల్లి: కాళేశ్వరం వద్ద 2. 89 లక్షల క్యూసెక్కుల వరద

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో 2. 89 లక్షల క్యూసెక్కుల వరద పారుతోంది. నాలుగు రోజులుగా గోదావరిలో పెరిగిన వరద ఆదివారం సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టింది. 2. 89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 
6. 2 మీటర్ల ఎత్తులో పారుతూ లక్ష్మీ బారేజ్ మెడిగడ్డ వైపు వెళ్తుంది. బారేజ్ లోని 85 గేట్లకు 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. రెండు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరద తగ్గింది.

సంబంధిత పోస్ట్