భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం హర్షధ్వానాలతో సందడిగా మారింది. అనంతరం గండ్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షులు కరాటే శీను ఆధ్వర్యంలో జిల్లా స్థాయి డాన్స్ పోటీలు నిర్వహించారు.