చిట్యాల మండలం, జూకల్ గ్రామ మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి, ఆయన తనయుడు శ్రీకాంత్ మొదట కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ అల్లం రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్, మాజీ సర్పంచ్ మహేందర్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.