ఎన్నికల నేపథ్యంలో మొగుళ్ళపల్లి మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా, పోతుగల్లు, ఇసిపేట గ్రామాలకు చెందిన నలుగురు రౌడీషీటర్లను స్థానిక తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు మొగుళ్ళపల్లి ఎస్సై బి. అశోక్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.