మృతి చెందిన వానరానికి డప్పు చప్పుళ్ల మధ్య అంత్యక్రియలు

చిట్యాల మండలం రామయ్యపల్లి శివారులోని తాటివనంలో తల్లి కోతి మృతి చెందగా, దాని పిల్ల కోతి మృతదేహాన్ని వీడకుండా అక్కడే ఉండిపోయిన సంఘటన స్థానికులను కలచివేసింది. ఈ హృదయవిదారక దృశ్యంపై స్పందించిన గ్రామ సర్పంచ్ కొడారి అశోక్, పంచాయతీ సిబ్బందితో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య మృతి చెందిన కోతికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి గౌరవప్రదంగా వీడ్కోలు పలికారు. మూగజీవాల పట్ల సర్పంచ్ చూపిన దయ, సంస్కారాన్ని గ్రామస్థులు అభినందించారు.

సంబంధిత పోస్ట్