జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద శుక్రవారం అక్రమంగా గంజాయి తరలిస్తున్న టెడ్డల శ్రీనివాస్ అనే యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా వారి వద్ద నుండి కిలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.