ఘణపురం: భద్రాద్రి రామయ్య గోటి తలంబ్రాలకు అంకురార్పణ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కు చెందిన శ్రీరామదాసు భక్త మండలి ఆధ్వర్యంలో భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఉపయోగించే కోటి గోటి తలంబ్రాల తయారీకి అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్య సన్నిధిలో పంటకు వినియోగించే విత్తనపు వడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అంతరం చెల్పూర్ గ్రామానికి చెందిన శ్రీ రామదాసు తిరుపతమ్మ-తిరుపతి పుణ్య దంపతుల వ్యవసాయ క్షేత్రంలో నాటి వడ్లుపండించనున్నారు.

సంబంధిత పోస్ట్