మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న భారీ వరద

భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం 3 లక్షల క్యూసెక్కులుగా ఉన్న నీరు సాయంత్రం వరకు 6.9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. వచ్చిన నీరును 85 గేట్లు ఓపెన్ చేసి అధికారులు గోదావరి నదికి వదులుతున్నారు. ప్రాణహిత నది నుంచి రాత్రి వరకు మరింత నీరు రానున్నట్లు తెలిపారు. బ్యారేజ్ వద్ద పోలీసులు 24 గంటలు గస్తీ కాస్తున్నారు.

సంబంధిత పోస్ట్