కాళేశ్వరం: 8 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుణ్యక్షేత్రం త్రివేణి సంగమ తీరంలో గోదావరి, ప్రాణహిత నదులు వరద ఉదృతితో పరవళ్లు తొక్కుతున్నాయి. బుధవారం ఉదయం నుంచే పెరుగుతూ సాయంత్రం గోదావరి ప్రవాహం 8 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. గోదావరి వరద ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. భక్తులు మెట్లపై ఉండే పుణ్యస్నానాలు చేశారు. వ్యాపారులు గోదావరిలో వేసుకున్న తాత్కాలిక గుడారాలన్నీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

సంబంధిత పోస్ట్