జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం చెల్పూర్ లో సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా అంగన్ వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి ముఖ్య అతిథిగా శనివారం హాజరయ్యారు. అంగన్ వాడీ టీచర్ల సేవలను అభినందిస్తూ వారిని శాలువాలతో సన్మానించారు. చిన్నారులు, గర్భిణులకు వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కీర్తి రెడ్డి అన్నారు.