పక్కా ప్రణాళికతో రాజ్యాధికారం సాధిద్దాం

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం మడతపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన కొయ్యడ దామోదర్ సర్పంచ్ గా గెలుపొందారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. రాష్ట్రంలో 04 సర్పంచ్ లు, 09 ఉప సర్పంచ్ లు, 123 మంది వార్డు మెంబర్లు విజయం సాధించినట్లు తెలిపారు. బహుజన ఉద్యమం కొన్నిసార్లు ఉవ్వెత్తున ఎగిసి పడుతుందని, మరికొన్నిసార్లు కింద పడుతుందని, అయితే పక్కా ప్రణాళికతో రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్