రేగొండ పోలీస్ స్టేషన్ పరిధి జగ్గయ్యపేట గ్రామానికి చెందిన రాజయ్య జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్పై సందీప్ కుమార్ తెలిపారు. మృతుడు రాజయ్య భార్య విమల ఐదేళ్ల క్రితం మృతిచెందగా, అప్పటినుంచి మానసికంగా ఇబ్బంది పడుతూ మద్యానికి అలవాటు పడి, భార్య లేని జీవితం తనకి ఎందుకని పురుగుల మందు తాగి మృతి చెందారు.