మహారాష్ట్రకు చెందిన కుటుంబం మేడారం అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్-కాళేశ్వరం ప్రధాన రహదారి ప్రకృతివనం సమీపంలో యూపీ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి పంపించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.