జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన మాదాసు మొగిలిని ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించినట్లు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన మాదాసు మొగిలి మాట్లాడుతూ ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని, తనకు బాధ్యత అప్పగించినందుకు జిల్లా పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ఓబీసీ మోర్చా బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకం ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలో జరిగింది.