వెంకటేశ్వర్లపల్లిలో మెయిన్ రోడ్డు పనులు ప్రారంభం

ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో సర్పంచ్ కాడవేనా సరిత యుగేందర్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు పనులు శనివారం  ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని, గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పున్నం రాజు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕