భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని మల్లారం సబ్ స్టేషన్ పరిధిలో ఏళ్ల తరబడి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తూ మంత్రి శ్రీధర్ బాబు కొత్త 11కేవీ లైన్ కోసం రూ. 25 లక్షల నిధులు మంజూరు చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త లైన్‌తో గ్రామానికి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యుత్ కష్టాలకు మోక్షం కలిగించింది.