పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

చిట్యాల మండల కేంద్రంలో రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన గొల్లన లక్ష్మి (30) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం చిట్యాలకు వచ్చిన ఆమె, ఊహించని విధంగా పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచింది. మృతురాలికి భర్త, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సివిల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్