జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామ ఈద్గా లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి, విశ్వాసానికి, దానధర్మాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. సమాజంలో సౌహార్దం, సోదరభావం మరింత పెరగాలని ఆకాంక్షించారు.