భూపాలపల్లిలోని సింగరేణి బొగ్గు గనుల కార్మికులను కలిసి గురువారం ఎమ్మెల్సీ మధుసూదనాచారి కలిశారు. సింగరేణి మైన్స్ లో పరిశీలిస్తూ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులపాటు జిల్లా కేంద్రంలోనే ఉంటానంటూ కార్మికులకు సూచించి.. ఏవైనా సమస్యలు ఉంటే తనను కలవచ్చు అంటూ కార్మికులకు చెప్పారు. గతంలో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించింది కూడా తానే అని మధుసూదనాచారి గుర్తు చేశారు.