జాతీయ ఐక్యత దినోత్సవం: గోరి కొత్తపల్లిలో రన్ ఫర్ యూనిటీ నిర్వహణ

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో జాతీయ ఐక్యత దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మండల ఎస్సై సాకాపురం దివ్య ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ (2కె రన్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దివ్య మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు, స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, ఆయన దేశభక్తి, త్యాగం, అంకితభావం, ప్రజలను ఐక్యంగా ఉంచాలనే ఆశయం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ రన్ ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను గౌరవించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఐక్యతను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, నాయకులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్