భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని అన్నారు. రాంనగర్, సుభాష్ కాలనీ వార్డుల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్‌లలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు.