జిల్లాలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి

భూపాలపల్లి జిల్లాలో అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఆయా మండలానికి సంబంధించిన సమస్యను సంబంధిత తహసిల్దార్ కు దరఖాస్తు రూపంలో అందజేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం తెలిపారు. భూ సమస్యలు పరిష్కారంలో ధరణిలో ఏ మాడ్యూల్ పై ప్రజలు దరఖాస్తు చేయాలనే అంశంపై తహసీల్దార్ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ ల్లోను, మీ సేవాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్