రేపటితో సరస్వతి అంత్య పుష్కరాల ముగింపు

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న అంతర్వాహిని సరస్వతి నది అంత్య పుష్కరాలు సోమవారంతో ముగుస్తున్నాయి. ఈ పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. 12 రోజులుగా ప్రపంచ శాంతి కోసం హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ పుష్కరాల్లో 8 మంది పీఠాధిపతులు పూజలు నిర్వహించారు. సోమవారం జరిగే ముగింపు ఉత్సవాలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్