తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సంకల్ప స్నానాలు, నది మాతాకు విశేష పూజలు, దీప దానాలు, పితృ దేవతలకు తర్పణాలు, పిండ ప్రధానాలు, సూర్య, నదికి ప్రధానాలు చేస్తున్నారు. ఘాటు వద్ద సరస్వతి విగ్రహానికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం భక్తులు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి తరలి వెళ్తున్నారు.