ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి పలు సూచనలు చేశారు.