పెద్దవాగులో బయటపడ్డ విష్ణుమూర్తి విగ్రహం

భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం శివారులోని పెద్దవాగులో పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. ఇసుకలో ఉన్న ఈ విగ్రహాన్ని గుర్తించి బయటకు తీశారు. మూడేళ్ల క్రితం కూడా విగ్రహంలోని కొంత భాగం ఇసుకలో కనిపించినా, అది బండరాయి కావచ్చని భావించి ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల ఇసుకలో విగ్రహం ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై చర్చ మొదలైంది.

సంబంధిత పోస్ట్