బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్ లో సునీల్ షార్ట్ ఫిల్మ్ కు పురస్కారం

చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి, దర్శకుడు మ్యాదరి సునీల్ దర్శకత్వంలో రూపొందిన 'ప్రజా బతుకమ్మ' షార్ట్ ఫిల్మ్ కు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుండి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్ లో భాగంగా పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీస్ లో ఫోటోగ్రఫీ చీఫ్ కెమెరామెన్ ఎన్. సంజీవ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో తాటి రేణుక, సమ్మయ్య, తాటి కళ్యాణి తదితరులు నటించారు. ఈ పురస్కారంపై జూకల్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్