బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగను ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలను ప్రోత్సహిస్తూ, విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్