రేగొండ మండలం కోటంచలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో మహేష్, చైర్మన్ నాయినేని సంపత్ రావు తెలిపారు. లోక కళ్యాణార్ధం ప్రతి నెలలో వచ్చే స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి వారి కళ్యాణం జరపడం ఆనవాయితీ అని వారు పేర్కొన్నారు.