మోటార్లకు కరెంట్ వైర్లు దొంగిలిస్తున్న ఇద్దరు యువకులకు దేహశుద్ధి

భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లి గ్రామ శివారులోని మోరంచ వాగు సమీపంలో పొలాల వద్ద మోటార్లకు సంబంధించిన కరెంట్ వైర్లను దొంగిలిస్తున్న ఇద్దరు యువకులను గ్రామస్తులు శుక్రవారం పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితులను గుర్తించిన గ్రామస్తులు వారిని పట్టుకుని, చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి, అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన యువకులు పరకాల మండలం వరిగొల్‌పల్లి గ్రామానికి చెందిన ముషికే శ్రీకాంత్, దొగ్గల సుకుమార్‌లుగా గుర్తించారు. గతంలో కూడా పలువురు రైతుల మోటార్లు, కరెంట్ వైర్లు, ఇతర విలువైన వ్యవసాయ సామగ్రి చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్