జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కూలీలు కొత్త నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. పని ప్రదేశంలో హాజరు నమోదుకు ఉదయం, సాయంత్రం ఫొటోలు తీసి అప్ లోడ్ చేయాల్సి ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆకుల శంకరయ్య అనే కూలీకి వందకు పైగా ఫొటోలు తీసినా యాప్ లో నమోదు కాలేదు. మొహానికి ఫౌడర్ అద్దినా ఫొటో రాకపోవడంతో, కూలీని పడుకోబెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ ఫొటో తీసినట్లు సమాచారం. ఫొటోలు దిగడానికి కూలీలకు గంట వరకు సమయం పట్టడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.