రాజీ మార్గాన్ని ఎంచుకుని వివాదాలు లేని జీవితాలను గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ సి. హెచ్. రమేశ్ బాబు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రమేశ్ బాబు మాట్లాడుతూ చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.