భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పాల్గొన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుని భూపాలపల్లిలో గులాబీ జెండా ఎగురవేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.