పరకాల పట్టణంలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే రేవూరి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను గుర్తుంచుకొని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వివిధ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులు చేపట్టి, 4వ, 16వ వార్డులలో పారిశుద్ధ్య లోపాలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఏఐసిసి సెక్రెటరీ, రాష్ట్ర పరిశీలకులు, మాజీ ఎంపీ పి. విశ్వనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, కాంగ్రెస్ పథకాలే పార్టీ గెలుపునకు నాంది పలుకుతాయని అన్నారు.