మహబూబాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మరో ఘోరానికి ఒడిగట్టారు. కంకరాబోడ్ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని లక్ష్యంగా చేసుకుని, వారిపై వేధింపుల కేసులు ఉన్నాయని బెదిరించి, ఏకంగా రూ.82,40,000 కాజేశారు. దుండగులు సీబీఐ అధికారులమని నమ్మించి, అరెస్ట్ వారెంట్ ఉందని భయపెట్టి, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విడతల వారీగా డబ్బును బదిలీ చేయించుకున్నారు.