మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఏర్పాటు సాధన కమిటీ నాయకుడు రవికుమార్ డిమాండ్ చేశారు. బయ్యారం మండలానికి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు డిమాండ్ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అందువల్ల గార్ల, గంగారం, కొత్తగూడ మండలాలను కలిపి నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.