మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలోని కందికొండ శివారులో ఆదివారం పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. పంట చేలల్లో గుర్తించిన పులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని గ్రామస్థులకు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.