మరిపెడ: బాలికల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏసీడీపీఓ తేజకళ్యాణి అన్నారు. మంగళవారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాలికల రక్షణ వారోత్సవాలను పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు మధ్యగల బాలికలకు బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ, ఎలోప్మెంట్ వంటి సమస్యలపై అవగాహన కల్పించారు. టీనేజ్ గర్భధారణ వల్ల తల్లి, శిశువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, చదువు మధ్యలో ఆగిపోవడం వల్ల బాలికల భవిష్యత్ అవకాశాలు తగ్గిపోతాయని ఆమె తెలిపారు.