మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో దారుణం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై దాడికి పాల్పడటంతో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి ఒంటిపై వాతలు తేలాయి. ఈ ఘటనపై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించి, దాడికి పాల్పడ్డ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్