మహబూబాబాద్ జిల్లా బయ్యారం యంపిడిఓ కార్యాలయం ముందు సోమవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. జాతీయ ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మండల అభివృద్ది అధికారికి వినతి పత్రం అందజేశారు. ఉపాధి హామీ బిల్లులు నిలిచి పోవడం వల్ల పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.