మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సత్యనారాయణపురం గ్రామం ఉన్న రామాలయంలో శనివారం అర్థరాత్రి దొంగలు హల్‌చల్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గడ్డపలుగులతో ఆలయంలో చొరబడి హుండీ పగులగొట్టేందుకు దొంగలు ప్రయత్నించగా శబ్దాలు రావటంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై దొంగలను వెంబడించగా పరారయ్యారు. దొంగతనం వీడియో సీసీ పుటేజీలో రికార్డైన ఆధారాలతో పోలీసులకు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.