డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి కొబ్బరికాయలు సమర్పించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకుని కొనియాడారు. 'వర్ధిల్లాలి రాజ్యాంగం' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.